US Immigration and Customs Enforcement: దిగొచ్చిన ట్రంప్ సర్కార్ ‌: వారికి భారీ ఊరట

US Immigration and Customs Enforcement: ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులను తమ స్వదేశాలకు వెళ్లాలని ఆదేశిస్తూ గత నెలలో తీసుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఆర్డర్లను జారీ చేసిన సంగతి తెలిసిందే

Update: 2020-07-15 07:21 GMT
US Immigration and Customs Enforcement

US Immigration and Customs Enforcement: ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులను తమ స్వదేశాలకు వెళ్లాలని ఆదేశిస్తూ గత నెలలో తీసుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఆర్డర్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆర్డర్లను తాజాగా రద్దు చేశారు. కళాశాలలు వివిధ సంస్థల నుండి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో విదేశీ విద్యార్థులను బలవంతంగా పంపించే ప్రణాళికను ట్రంప్ సర్కార్ మంగళవారం విరమించుకుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ తరగతులకు మారిన కళాశాలల్లో విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్ళవలసి ఉంటుందని యుఎస్ అధికారులు గత వారం ప్రకటించారు. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఆదేశాలను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.

కాగా యుఎస్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో మిలియన్ కంటే ఎక్కువ విదేశీ విద్యార్థులు ఉన్నారు, అలాగే చాలా పాఠశాలలు విదేశీ విద్యార్థుల నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటాయి, వారు తరచుగా పూర్తి ట్యూషన్ చెల్లిస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ఉత్తర్వులపై ఆ దేశంలో కళాశాల సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. విద్యార్థులు వెళ్లడం వలన తమకు భారీ ఎత్తున నష్టం వస్తుందని సర్కారుకు తెలిపాయి. అంతేకాదు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు వ్యాజ్యాలు కూడా దాఖలు చేశాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ సర్కారు దిగివచ్చి ఉత్తర్వులను వెనక్కితీసుకుంది.


Tags:    

Similar News