Viral News: ఈ చిన్నారి పాప పేరు పకోడీ.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..
Viral News: సాధారణంగా చిన్నారులకు పేర్లు పెట్టడానికి.. రకరకాలుగా ఆలోచిస్తారు.. సంప్రదాయాలకు, నమ్మకాలకు అనుగుణంగా పేర్లు పెడుతుంటారు.
Viral News: ఈ చిన్నారి పాప పేరు పకోడీ.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..
Viral News: సాధారణంగా చిన్నారులకు పేర్లు పెట్టడానికి.. రకరకాలుగా ఆలోచిస్తారు.. సంప్రదాయాలకు, నమ్మకాలకు అనుగుణంగా పేర్లు పెడుతుంటారు. మరికొందరు ఇష్టదైవమో ఇష్టమైన వ్యక్తుల పేర్లనో ఎంచుకుంటారు. ఇంకొందరు స్థలాల పేర్లు, పురాణ గాథల్లోని పేర్లు పిల్లలకు పెడుతుంటారు. కానీ ఇటీవల పిల్లలకు పలువురు వెరైటీగా విచిత్రంగా ఉండే పేర్లను పెట్టడం ఓ ట్రెండ్‌లా మారింది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన కొడుకు, కూతురికి ఎక్స్, వై అనే పేర్లు పెట్టారు. అలాగే ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన ఓ చిన్నారికి కూడా వెరైటీ పేరును పెట్టారు. అది కూడా నోరూరించే వంటకం పకోడి పేరును పెట్టడం ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో పాప పేరు తెగ వైరల్ అవుతోంది.
బ్రిటన్‌కు చెందిన హిలరీ బ్రానిఫ్ ఉత్తర ఐర్లాండ్‌లోని ది క్యాప్టెన్స్ టేబల్ పేరిట ఓ రెస్టారెంట్‌ను నడుపుతోంది. ఆమెకు, కుటుంబ సభ్యులకు పకోడీ అంటే ఎంతో ఇష్టం. ఇటీవల హిలరీ బ్రానిఫ్‌కు మనవరాలు పుట్టింది.. పకోడిపై ఇష్టంతో.. ఆ చిన్నారికి ఆ పేరునే పెట్టింది. అంతేకాదు ఏదో రెస్టారెంట్‌లో పాప పేరిట బిల్లును కూడా తీసుకున్నారు. ఆ బిల్లును, పాప ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్రిటన్‌లో హోటల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించడానికే ఆ పేరు పెట్టినట్టు బ్రానిఫ్ తెలిపింది. అంతేకాదు పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాలని కూడా ఆమె కోరింది.
అయితే ఇప్పుడు చిన్నారి పాపాయికి పకోడి పేరు పెట్టడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్నారికి పెట్టిన పేరుపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. తమ పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ పలు పంటకాల పేర్లను మెన్షన్ చేస్తున్నారు. తన పిల్లలకు కబాబ్, చిప్స్, గార్లిక్ సాస్ పేర్లు పెట్టినట్టు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మా ఇద్దరు పిల్లలు చికెన్, టిక్కా అంటూ మరో నెటిజన్ తన పిల్లల ఫొటోలను షేర్ చేశారు. ఇలా పకోడి చిన్నారిపై నెటిజన్లు జోరుగా కామెంట్లు చేస్తూ ఆ పాపాయి ఫొటోను, బిల్లును షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాను ఇప్పుడు పకోడి పాపాయి షేక్ చేస్తోంది.