కరోనా కట్టడికి 'ట్విట్టర్ సీఈఓ' అతిపెద్ద విరాళం

కరోనా కట్టడికి ట్విట్టర్ సీఈఓ నడుం బిగించారు.. కరోనాను ఎదుర్కొనేందుకు జాక్ డోర్సే పరిశోధనలకు 1 బిలియన్ (7,600 కోట్లు) విరాళంగా ఇస్తానని ప్రకటన చేశారు.

Update: 2020-04-09 04:24 GMT
Twitter CEO Jack Dorsey

కరోనా కట్టడికి ట్విట్టర్ సీఈఓ నడుం బిగించారు.. కరోనాను ఎదుర్కొనేందుకు జాక్ డోర్సే పరిశోధనలకు 1 బిలియన్ (7,600 కోట్లు) విరాళంగా ఇస్తానని ప్రకటన చేశారు.ఈ మేరకు "గ్లోబల్ కోవిడ్ -19 ఉపశమనం కోసం" స్టార్ట్ స్మాల్ అనే ఛారిటబుల్ ఫండ్‌కు 1 బిలియన్ల స్క్వేర్ షేర్లను విరాళంగా ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

ఈ సందర్బంగా మాట్లాడిన జాక్ డోర్సే ఈ విరాళం "నా సంపదలో 28%" కు సమానం అని అన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం డోర్సీకి సుమారు 9 3.9 బిలియన్ల సంపద ఉంది. కాగా కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇది అతిపెద్ద విరాళం అని చెప్పవచ్చు.. ప్రపంచంలో ఇంతవరకూ ఇంతపెద్ద మొత్తంలో ఎవ్వరూ ఇవ్వలేదు.

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనవంతుడు జెఫ్ బెజోస్ ఫుడ్ బ్యాంక్ ఛారిటీ ఫీడింగ్ అమెరికాకు 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఆయనే కాదు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి అలాగే చికిత్సలకు 100 మిలియన్ డాలర్లు ఇచ్చారు. డెల్ కంప్యూటర్ల వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్ 100 మిలియన్ డాలర్లు.


Tags:    

Similar News