Donald Trump: హమాస్‌కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Donald Trump: సుదీర్ఘకాల యుద్ధం అనంతరం ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదిరింది.
Donald Trump: హమాస్‌కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Donald Trump: సుదీర్ఘకాల యుద్ధం అనంతరం ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదిరింది. తాజాగా ఒప్పందం ఉల్లంఘనకు గురవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనుకుంటే.. గాజాలో ఖాళీ చేయించిన ప్రాంతాల్లోకి తిరిగి వెళ్లి హమాస్‌ను అంతం చేయమని ఇజ్రాయెల్‌ను కోరతానని వ్యాఖ్యానించారు.
హమాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గొప్పదని ఆయన అన్నారు. ఈ క్రమంలో అది మంచిగా ఉండాలని, లేకుంటే దాన్ని నిర్మూలిస్తామని బెదిరించారు. హింస తగ్గుతుందనే ఆశతో తాను చేసిన కాల్పుల విరమణ ఒప్పందం విజయవంతం అయ్యేందుకు అవకాశం ఇవ్వాలనే ఆగిపోతున్నానన్నారు. కానీ, నిరంతర దాడులకు పాల్పడుతూ ఉంటే సహించేది లేదని ప్రస్తావించారు.