Donald Trump: మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 ఏళ్ల డెస్క్‌నే మార్చేసిన ట్రంప్..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కుమారుడి అల్లరి వల్ల ట్రంప్ తన డెస్క్‌నే మార్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల మస్క్ తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 ఏళ్ల డెస్క్‌నే మార్చేసిన ట్రంప్..!
Donald Trump: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కుమారుడి అల్లరి వల్ల ట్రంప్ తన డెస్క్‌నే మార్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల మస్క్ తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసిన సంగతి తెలిసిందే. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో వీరిద్దరూ మీడియా సమావేశంలో పాల్గొనగా.. మస్క్ కుమారుడి అల్లరి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
మస్క్ కుమారుడి అల్లరి వల్ల ఓవల్ ఆఫీసులో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్‌ను తీసేయించారు ట్రంప్. దాని స్థానంలో సీ అండ్ ఓ డెస్క్‌ను పెట్టించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్రూత్ ఖాతాలో పంచుకున్నారు. అయితే ఇది తాత్కాలిక మార్పేనని చెప్పారు ట్రంప్. అసలు మస్క్ కుమారుడి అల్లరికి ట్రంప్ డెస్క్ మార్చడానికి కారణం ఏంటా అనుకుంటున్నారా..?
ట్రంప్‌కు అతి శుభ్రత ఎక్కువంట. మస్క్ కుమారుడు తన అల్లరితో ఆ టేబుల్ పై చేతులు పెట్టడం, రుద్దడం వంటి పనులు చేశాడు. ఇక బ్యాక్టీరియా భయంతో అతి శుభ్రత పాటించే ట్రంప్.. చిన్నారి చేష్టల కారణంగానే టేబుల్ మార్చినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ పోస్ట్ చేస్తూ శ్వేత సౌధంలోని 7 డెస్క్‌ల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం అధ్యక్షుడికి ఉంటుందన్నారు. ఈ సీ అండ్ ఓ డెస్క్‌ను గతంలో జార్జ్ బుష్.. మరికొందరు అధ్యక్షులు ఓవల్ ఆఫీస్‌లో వినియోగించారు. ఇప్పటి వరకు ఇక్కడున్న రెజల్యూట్ డెస్క్‌ను మరమ్మతుల కోసం పంపించాం. అది చాలా అత్యవసరం అని రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ రెజల్యూట్ డెస్క్‌ను 1880లో అప్పటి బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా నాటి అమెరికా అధ్యక్షుడు రూథర్ ఫోర్డ్‌కు కానుకగా ఇచ్చారు. దీన్ని బ్రిటీష్ రాయల్ నేవీలో సేవలందించి వైదొలిగిన హెచ్‌ఎంసెస్ రెజల్యూట్ అనే నౌక చెక్కతో తయారు చేశారు. అయితే గతవారం మస్క్ శ్వేతసౌధానికి వచ్చి అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలో కుమారుడు ఎక్స్ ఏఈఏ క్స్జి కూడా వెంటే ఉన్నారు. మస్క్ మీడియాతో మాట్లాడుతుండగా ఈ పిల్లాడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తండ్రి తలపై ఎక్కి కూర్చున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అంతేకాదు అంతా సీరియస్‌గా డిస్కస్ చేస్తుంటే మస్క్ కుమారుడు మాత్రం ట్రంప్‌ను టార్గెట్ చేశారు. ట్రంప్ పక్కనే కూర్చొని మాటిమాటికి నీ నోరు మూసుకో అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత పదే పదే నువ్వు అధ్యక్షుడు కాదు. నువ్వు వెళ్లిపోవాలి. అనడంతో ట్రంప్ ముఖం కోపంతో ఎర్రబడింది. అయినా తనను తాను నియంత్రించుకోని ఆ పిల్లవాడి మాటలను పట్టించుకోవడం మానేశాడు. మీడియా తీసిన వీడియోలు బయటకు వచ్చాక వైరల్ అయ్యాయి. ట్రంప్ ను అంత మాటనేసి ఎలా నోరుమూయించాడో చూడండి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేశారు.
ఇక తన అల్లరితో ట్రంప్ నోరు మూయించిన మస్క్ కుమారుడు.. ఇప్పుడు ఏకంగా ఓవల్ ఆఫీసులోని 145 ఏళ్ల డెస్క్‌నే తీసేయించేలా చేశాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.