Donald Trump: టారిఫ్‌లను ఆయుధంగా వాడి యుద్ధాలు ఆపేశాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump: గాజా ఒప్పందం కోసం పశ్చిమాసియాకు పయనమైన వేళ ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు.
Donald Trump: టారిఫ్‌లను ఆయుధంగా వాడి యుద్ధాలు ఆపేశాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump: గాజా ఒప్పందం కోసం పశ్చిమాసియాకు పయనమైన వేళ ట్రంప్ కీలక విషయాలు వెల్లడించారు. నేను ఆపిన ఎనిమిదో యుద్ధం గాజా అవుతుందన్నారు. యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని అని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్‌లను ఆయుధంగా వాడి తాను సంక్షోభాలను పరిష్కరించానని పునరుద్ఘాటించారు.
దీనికి భారత్-పాక్ సైనిక ఘర్షణను ఆయన ఉదాహరణగా చూపారు. ఇరుదేశాలపై టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించడంతో 24 గంటల్లో యుద్ధం ఆగిపోయిందన్నారు. టారిఫ్‌లు లేకపోతే తాను ఎప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోయేవాడినని వెల్లడించారు.