Donald Trump: యుద్ధాలను ఆపాను, నాకు నోబెల్ ఇవ్వండి: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
Donald Trump: వాణిజ్యాన్ని చూపి భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు.
Donald Trump: వాణిజ్యాన్ని చూపి భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. మొత్తం మీద ఏడు యుద్ధాలను ఆపానని.. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికపై గతంలో అమెరికా ఎన్నడూ పొందని గౌరవాన్ని ఇప్పుడు పొందే విధంగా వ్యవహరిస్తున్నామన్నారు.
యుద్ధాలను నిలువరించి శాంతి ఒప్పందాలు చేస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ శాంతి బహుమతి వస్తుందని తనతో కొందరు చెప్పారని.. ఏదో ఒక రీతిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.