Third Wave: ప్రపంచ దేశాలకు థర్డ్‌వేవ్‌ భయం

Third Wave: భయం ఉన్నా.. జాగ్రత్తలు పాటించని జనాలు * ఫంక్షన్లకు కబురు రాగానే పరుగులు

Update: 2021-07-25 09:58 GMT
కరోనా థర్డ్ వేవ్ భయం (ఫైల్ ఇమేజ్)

Third Wave: థర్డ్‌ వేవ్‌ ముచ్చుకువస్తోందా.. ఇది సెకండ్ వేవ్ కంటే ప్రమాదకరమా.. చిన్న పిల్లల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుదన్న వాదనలో వాస్తవమెంట.? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడందరినీ వేధిస్తున్నాయి. మరీ అంతర్జాతీయ వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఏం చర్యలు చేపడుతోంది. ఐసీయూ బెడ్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను ప్రభుత్వాలు సమకూర్చుతున్నాయా.. తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి? ఒకవేళ థర్డ్‌వేవ్‌ వస్తే.. జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందా..

అంతర్జాతీయ వైద్య నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయి. కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ఎంటరైంది. ఇదిలా ఉంటే.. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసేందుకు సిద్ధమవుతున్నాయి. మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లను, స్కూళ్లను తెరిచేసేందుకు కసరత్తులు చేస్తున్నాయి.

మరోవైపు జనాలు కూడా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలను లైట్‌ తీసుకుంటున్నారు. కోవిడ్‌ రూల్స్‌ని గాలికి వదిలేశారు. ఫంక్షన్లకు కబురు రాగానే పరుగులు తీస్తున్నారు. ఏమైనా పండుగలు వస్తే హ్యాపీగా సెలబ్రెట్‌ చేసుకుంటున్నారు. పోని సామాజిక దూరం పాటిస్తున్నారా అంటే అదీ లేదు. మాస్క్‌ చెవులకు వేలాడుతుంది తప్పా ముక్కుని,నోటిని కవర్‌ చేసిన పాపాన పోవడం లేదు.

థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువగా ఎఫెక్ట్‌ ఉండొచ్చని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఐనా ఎవరూ ఏమాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు. వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం టెన్షన్‌ పడుతున్నారు. ఒకవేళ వైరస్‌ వస్తే.. పరిస్థితి ఎంటని ఆలోచనలో పడ్డారు.

ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ వేసే వరకు వారిని వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా రాకున్నా ముందుస్తు జాగ్రత్త తీసుకుంటే పోయేదేముందని వైద్యులు అంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. దాదాపు 500 పడకలతో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు సమకూర్చింది. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులను కూడా నోడల్ సెంటర్‌గా మార్చాలని యోచిస్తున్నారు.

ఒకవేళ పిల్లలు వైరస్‌ బారిన పడితే మానసిక ఒత్తిడికి గురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే బెటర్‌ అని వైద్యులు సూచిస్తున్నారు.

సామాజిక దూరం, మాస్క్ విధిగా ధరించడం పిల్లలకు కూడా అలవాటు చేయాలని వైద్యులు అంటున్నారు. అత్యవసరమైతే తప్పా పిల్లలను బయటకు తీసుకోకపోవడం మంచింది. రానున్న మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉంటేనే థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 

Tags:    

Similar News