బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌కు పదవీ గండం.. రేసులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు..

Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏడాదిన్నర క్రితం చేసిన తప్పు ఇప్పుడు ఆయన పదవికే గండం తెచ్చిపెడుతోంది.

Update: 2022-01-15 07:03 GMT

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌కు పదవీ గండం.. రేసులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు..

Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏడాదిన్నర క్రితం చేసిన తప్పు ఇప్పుడు ఆయన పదవికే గండం తెచ్చిపెడుతోంది. అన్నీ కలిసొస్తే బ్రిటన్‌ అధికార పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని లండన్ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఒకవైపు కరోనా మహమ్మారి విలయతాండం చేస్తుంటే బోరిస్ తన అధికారిక నివాసంలో తన సహచరులతో కలిసి మందు పార్టీలు చేసుకోవడం ఆయన కుర్చికే ఇప్పుడు పెద్ద ఎసరు తెచ్చిపెట్టేలా తయారైంది. మద్యం పార్టీ వ్యవహారాన్ని బోరిస్ స్వయంగా ఆంగీకరించడంతో ఆయన ఇక ప్రధాని పదవిలో కొనసాగడానికి అర్హతలేదంటూ ప్రతిపక్ష పార్టీతో పాటు సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తదుపరి ప్రధాని ఎవరన్న చర్చలో ప్రధానంగా భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు వినిపిస్తోంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక మంత్రి అయిన రుషి సూనక్.

ఏడాదిన్నర క్రితం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ '10 డౌన్ స్ట్రీట్' లోని తన అధికారిక నివాసంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన సహచరులతో కలిసి మందు పార్టీలు నిర్వహించారు. దేశంలో కరోనాతో ఒకవైపు ప్రజలు ప్రాణాలు పోతుంటే నిబంధనలను ఉల్లంఘించి ఒక బాధ్యత గల ప్రధాని మద్యం విందులు చేసుకోవడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. బోరిస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీయే కాకుండా సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. దీంతో బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్షమాపణలు చెప్పారు. బోరిస్ క్షమాపణలు చెప్పినా ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News