Paksitan on Dawood Ibrahim: దావూద్ కరాచీలోనే ఉన్నాడు: పాక్

Paksitan on Dawood Ibrahim: భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నట్లు తాజాగా పాకిస్తాన్ అంగీకరించింది.

Update: 2020-08-23 01:51 GMT

Paksitan on Dawood Ibrahim: భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నట్లు తాజాగా పాకిస్తాన్ అంగీకరించింది. అంతర్జాతీయంగా వస్తున్నా ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్.. దావూద్ ఆదాయ మార్గాలపై నిఘా పెట్టింది. దావూద్ తో సహా 88 నిషేధిత ఉగ్ర సంస్థలు, అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా పాక్ విదుల చేసిన జాబితాలో హఫీజ్ నయీద్, మసూద్ అజర్, జకీర్‌ రెహమాన్‌ లఖ్వీ పేర్లు కుడా ఉన్నాయి. కాగా, నిన్నటి వరకు దావూద్ తమ దేశంలో లేదని పాక్ బుకాయించిన విషయం తెలిసిందే.

పారిస్‌లోని ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ను 2018లో గ్రే లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. తరువాత 2019 చివరి నాటికి ఉగ్రవాద సంస్థలు, వాటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ గడువును పొడిగించింది. ఇదే క్రమంలో గ్రే లిస్ట్‌ ముప్పు నుంచి తప్పించుకునేందుకు పాక్ ఆగష్టు 18న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. నిషేధిత ఉగ్ర సంస్థలు, అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. పాక్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ దప్రకారం దావూద్ ఇబ్రహీం పాక్లోని కరాచిలో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. దావూద్ మొదట్నుంచి కరచిలోనే ఉంటున్నాడని భారత్ ముందునుంచే చెపుతుంది. గ్రే లిస్ట్​లో ఉంటే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందడం పాకిస్థాన్‌కు కష్టమవుతుంది. అయితే, పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకే తాజా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News