Viral News: ప్రపంచం ముందు మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్
Viral News: ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలు అయింది. దేశీయ ప్రయాణికుడిని పొరపాటున విదేశాలకు పంపి నవ్వులపాలైంది.
Viral News: ప్రపంచం ముందు మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్
Viral News: ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలు అయింది. దేశీయ ప్రయాణికుడిని పొరపాటున విదేశాలకు పంపి నవ్వులపాలైంది. లాహోర్ నుంచి కరాచీ వెళ్లేందుకు మాలిక్ షాజహాన్ అనే వ్యక్తి ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే లాహోర్ విమానాశ్రయ సిబ్బంది... సదరు ప్రయాణికుడిని కరాచీ వెళ్లాల్సిన విమానం కాకుండా సౌదీ అరేబియాకు వెళ్లే విమానాన్ని ఎక్కించారు. విమానం సౌదీ అరేబియాకు వెళ్తుందన్న విషయం తెలియని మాలిక్ షాజహాన్ ఓ కునుకు తీశాడు.
తీరా సౌదీ అరేబియా చేరుకున్న మాలిక్‌ను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకోగా.... కరాచీ వెళ్లాల్సిన వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. అయితే వెంటనే మాలిక్ షాజహాన్‌ను పాకిస్థాన్‌కి పంపించేశారు. ఈ ఘటనపై సదరు ప్రయాణికుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.