Imran Khan: 15 తరువాత లాక్ డౌన్ ను పెంచే యోచనలో పాక్..

పాకిస్థాన్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.

Update: 2020-04-13 11:23 GMT
PM of Pakistan, Imran Khan

పాకిస్థాన్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పౌర , సైనిక నాయకత్వంతో కూడిన పాకిస్తాన్ కమాండ్ అండ్ కంట్రోల్ అథారిటీ సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ఏప్రిల్ 15న తరువాత కూడా విస్తరించాలా? వద్దా అనే విషయంపై చర్చించినట్లు ఇద్దరు క్యాబినెట్ మంత్రులు న్యూస్ ఏజన్సీ రాయిటర్స్ కు చెప్పారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పాకిస్థాన్.. మరో 10 రోజులు లేదా కొన్ని వారాల పాటు లాక్ డౌన్ పొడిగించబోతుందని చెప్పారు. అంతేకాదు ఈ సమావేశంలో వైరస్ హాట్ స్పాట్‌లను మూసివేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.

అలాగే ఈ సమావేశం అనంతరం కొన్ని పరిశ్రమలను, ముఖ్యంగా నిర్మాణ మరియు ఎగుమతి రంగాలను తిరిగి తెరిచే దశల వారీ ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. కాగా పాకిస్తాన్ లో మొత్తం 5,374 వైరస్ కేసులు నమోదయ్యాయి, ఇప్పటివరకూ 93 మంది మరణించారు.


Tags:    

Similar News