Coronavirus Lockdown: ఎట్టకేలకు అనుమతి సాధించిన పాక్ ప్రజలు

పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా పాకిస్తాన్ ప్రజలు మసీదులలో నమాజ్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.

Update: 2020-04-19 02:04 GMT

పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా పాకిస్తాన్ ప్రజలు మసీదులలో నమాజ్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.ఎట్టకేలకు సాధించుకున్నారు. దేశంలో కొనసాగుతున్న పాక్షిక లాక్డౌన్ మధ్య ప్రభుత్వం నమాజ్ కు అనుమతి ఇచ్చింది. తొలుత లాక్డౌన్ విధించే సమయంలో ఏ మసీదు లోనైనా ఐదు మందికి పైగా గుమిగూడకుండా ఉండాలని ఆదేశించారు. అయితే, దీనిని చాలా మంది పాటించలేదు. కరాచీలోని మసీదుల్లో భారీగా ముస్లింలు నమాజ్ కు చేసుకునేందుకు చేరుకున్నారు. ఈ క్రమంలో దీనిని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులపైనే దాడులకు దిగారు.. ఈ దాడిలో మహిళా డిఎస్పి ఒకరు తీవంగా గాయపడ్డారు.

దీంతో శనివారం పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి స్వయంగా అంగంలోకి దిగారు.. ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. అనంతరం కొన్ని షరతులతో మసీదులలో ప్రార్థనలు చేసుకునేందుకు అంగీకరించారు. మసీదులో నమాజ్ చేసుకునే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అంతేకాదు ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. నమాజ్ చేసుకొని ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, పరిసర ప్రాంతాల్లో ఉమ్మి వేయకూడదని ఆంక్షలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ముస్లిం ప్రజలు ఇలా ఆంక్షలతో నమాజ్ చేసుకుంటున్నారు.


Tags:    

Similar News