Viral Video: ఇదీ పాకిస్థాన్ దుస్థితి.. వైర‌ల్ అవుతోన్న న‌టి సెల్ఫీ వీడియో

Viral Video: పాకిస్థాన్‌కు చెందిన నటి హీనా ఖవాజా బయాత్ ఇటీవల కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ అసౌకర్యాన్ని ఎదుర్కొని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లోని వాష్‌రూమ్‌లలో కనీస నీరు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వెల్లగక్కారు.

Update: 2025-05-30 05:51 GMT

Viral Video: ఇదీ పాకిస్థాన్ దుస్థితి.. వైర‌ల్ అవుతోన్న న‌టి సెల్ఫీ వీడియో

Viral Video: పాకిస్థాన్‌కు చెందిన నటి హీనా ఖవాజా బయాత్ ఇటీవల కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ అసౌకర్యాన్ని ఎదుర్కొని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లోని వాష్‌రూమ్‌లలో కనీస నీరు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వెల్లగక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హీనా ఖవాజా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ – ‘‘దేశ అభివృద్ధి గురించి గర్వంగా మాట్లాడే సమయంలో.. మన ఎయిర్‌పోర్ట్‌లలో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నదే విచారకరం. నమాజ్ చేసుకునేందుకు, పిల్లల అవసరాల కోసం నీరు కూడా లేని పరిస్థితి కలవడం బాధాకరం.’’ అని వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరూ అభివృద్ధి గురించి మాట్లాడతారంటూ విమర్శలు గుప్పించిన హీనా, కానీ మౌలిక సదుపాయాలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదన్నారు. ‘‘సేవల నిర్వహణలో స్పష్టమైన లోపాలున్నాయి. సమర్థత లేకపోవడం, బాధ్యత లేని వ్యవస్థలు దేశాన్ని దెబ్బతీస్తున్నాయి. సాధారణ పౌరుల అవసరాలను పక్కన పెట్టి, ఆలోచించాల్సిన దిశల్ని మర్చిపోతున్నాం,’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయగా, పాకిస్థాన్‌లో ఇప్పటికే నీటి లభ్యతపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో నీటి సమస్యపై స్పందించిన హీనా ఖవాజా పరిణామాలపై మరింత దృష్టిని తీసుకువచ్చింది. పాక్‌లో నీటి నిర్వహణలో అవ్యవస్థ, ప్రభుత్వ వైఫల్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 



Tags:    

Similar News