ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్‌ సవాల్‌.. వరల్డ్‌వైడ్‌గా 20,964కు చేరిన కేసులు

Omicron Cases: ప్రపంచ దేశాలకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ సవాల్‌ విసురుతోంది.

Update: 2021-12-16 06:09 GMT

ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్‌ సవాల్‌.. వరల్డ్‌వైడ్‌గా 20,964కు చేరిన కేసులు

Omicron Cases: ప్రపంచ దేశాలకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ సవాల్‌ విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో 20వేల 964 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. యూకేలో అత్యధికంగా 10వేల మార్క్‌ను దాటేయగా డెన్మార్క్‌లో 6వేలు, నార్వేలో 15వందల కేసులు వెలుగు చూశాయి. ఇక 84 దేశాల్లో మరో లక్షమందికి ఒమిక్రాన్‌ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు భారత్‌లోనూ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ వైరస్‌ పాకింది. భారత్‌లో ఇప్పటివరకు 73 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. రిస్కు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు కంపల్సరీ చేసింది. వారి పరీక్ష ఫలితాలు వెల్లడైన తరువాతనే వారిని బయటకు పంపే చర్యలు చేపట్టింది.

నిన్న కొత్తగా తెలంగాణలో రెండు, తమిళనాడులో ఒక ఒమిక్రాన్‌ కేసు బయటపడింది. అలాగే అబుదాబి నుంచి హైదరాబాద్‌ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. దీంతో అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు తెలంగాణ వైద్యాధికారులు. డిసెంబర్‌ 12న కెన్యా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 24ఏళ్ల యువతితో పాటు సోమాలియాకు చెందిన 23ఏళ్ల యువకుడికి కొత్త వేరియంట్‌ సోకింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తమిళనాడులో మొదటి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. డిసెంబర్‌ 10న నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. శ్యాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే కేరళలో నిన్న ఒక్కరోజే 4 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌ రూల్స్‌ కఠినతరం చేసింది.

Tags:    

Similar News