Nepal Banned Indian News Channels: నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్ల నిలిపివేత

Nepal Banned Indian News Channels: నేపాల్ లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం గురించి ప్రపంచానికి తెలియకుండా చెయ్యాలని ఆ దేశం ప్రయత్నిస్తోంది.

Update: 2020-07-10 06:45 GMT
Representational Image

Nepal Banned Indian News Channels: నేపాల్ లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం గురించి ప్రపంచానికి తెలియకుండా చెయ్యాలని ఆ దేశం ప్రయత్నిస్తోంది. నిజాలను సమాధి చెయ్యాలని భావించింది. ప్రస్తుతం నేపాల్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోనే ఉంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ప్రసారం చేసినందుకు భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది నేపాల్. దూరదర్శన్ మినహా భారతీయ వార్తా ఛానెళ్లను నిలిపివేయాలని కేబుల్ ఆపరేటర్లకు నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ప్రధాని కెపి శర్మ ఓలి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. లోలోపలే చేయాల్సిందంతా చేసి.. ఈ చర్య గురించి తమకేమి తెలియదన్నట్టుగా కేబుల్ ఆపరేటర్ల మీద నెపం నెట్టివేసింది. పైగా నేపాలీ పౌరుల సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భారతీయ మీడియా వార్తలను ప్రచారం చేస్తోందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు నేపాల్ లో భారతీయ మీడియా పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని.. తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి దౌత్య మార్గాలను సమీకరిస్తామని పేర్కొంది. కొంతకాలంగా నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలిపై భారత మీడియా నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తోందని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట ఆరోపించారు. అలాగే, నేపాల్ ప్రధాన సలహాదారు పిఎం బిష్ణు రిమల్ కెపి శర్మ ఒలికి సంబంధించి భారతదేశం మీడియా నుండి వచ్చిన వార్తలు అవాస్తవం అని ఇలా చేయడం భారత మీడియాకు తగదని చెబుతున్నారు.


Tags:    

Similar News