అమెరికాలో 24 గంటల్లో దాదాపు 2 వేల మంది మృతి..

అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తూనే ఉంది. కరోనావైరస్ బారిన పడిన దాదాపు 2 వేల మంది గత 24 గంటల్లో అమెరికాలో మరణించారు.

Update: 2020-04-09 02:37 GMT

అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తూనే ఉంది. కరోనావైరస్ బారిన పడిన దాదాపు 2 వేల మంది గత 24 గంటల్లో అమెరికాలో మరణించారు.ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం రాత్రి 8:30 సమయంలో వివరాలు వెల్లడించింది. రికార్డు స్థాయిలో 1,939 మంది మరణిసంచారని.. దాంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం మరణాల సంఖ్య 12,722 కు చేరుకుంది, ఇది ఇప్పటివరకు అత్యంత నష్టపోయిన దేశాలలో జాబితాలో మూడో స్థానంలో ఉంది.

మొదటి స్థానంలో ఇటలీ ఉంది.. ఇక్కడ 17,127 మంది మరణించారు.. ఆ తరువాత స్పెయిన్ లో 13,798 మంది మరణించారు. మరోవైపు అమెరికాలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 434,927 ఉంది.. ఇందులో కోలుకున్న వారు 22,891 మంది ఉన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యధికంగా న్యూయార్క్ రాష్ట్రం ప్రభావితమైంది. ఇక్కడే అత్యధిక కేసులు, మరణాలు ఉన్నాయి. ఇక్కడ 151.171 మంది వైరస్ భారిన పడితే.. 6.268 మంది మరణించారు.

Tags:    

Similar News