Kamala Harris: కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో నాచో నాచో సాంగ్
Kamala Harris:స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సౌత్ ఏషియన్ కమ్యూనిటీ
Kamala Harris
Kamala Harris: నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం కమలా హారిస్ ప్రచారం ముమ్మరం చేశారు. అయితే కమలా హారిస్‌కు మద్దతుగా సౌత్ ఏషియన్ కమ్యూనిటీ ఓ స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. అమెరికాలో భారత సంతతి ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆస్కార్ అవార్డు వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు థీమ్ సాంగ్‌ను నాచో నాచో పేరుతో స్పెషల్‌గా పబ్లిసిటి చేస్తున్నారు.
మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా వంటి కీలకమైన రాష్ట్రాల్లో దాదాపు 5 మిలియన్ల మంది దక్షిణాసియా ఓటర్లకు చేరువయ్యేందుకు ఈ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. 1.5 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో హమారీ యే కమలా హారీస్ అనే హిందీ పాట ఉంది. కాగా కమలా హారిస్ ప్రచారంలోని సన్నివేశాలను హైలెట్ చేస్తూ సాంగ్ జత చేశారు. ఈ పాటలో తెలుగు, తమిళం, గుజరాతీ, పంజాబీ, హిందీ భాషల్లో పలు సంఘం నాయకుల సందేశాలున్నాయి.