మలేసియా ప్రధాని సంచలన నిర్ణయం!

మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ మొహమాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2020-02-24 10:23 GMT

మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ మొహమాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తన రాజీనామాను దేశ రాజుకు సమర్పించినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది, దీంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2018 మేలో మలేసియా ప్రధాని బాధ్యతలు చేపట్టిన మహతీర్ మహ్మద్.. ప్రపంచంలో అధిక వయసున్న ప్రధానిగా రికార్డు సృష్టించారు.

94 ఏళ్ల మహతీర్ తన వారసుడిగా అన్వర్ ఇబ్రహీంను మినహాయించే కొత్త పాలక కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాల మధ్య ఈ ఆశ్చర్యకరమైన ప్రకటన వెలువడింది. తదుపరి ప్రధాని ఎవరైనా అవుతారా? లేదా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా అనే దానిపై స్పష్టత రావలసి ఉంది. ఇదిలావుంటే ప్రధానమంత్రికి మద్దతుగా పాలక సంకీర్ణ పకటాన్ హరపాన్ నుంచి తప్పుకుంటున్నట్లు మహతీర్ పార్టీ మలేషియా యునైటెడ్ ఇండిజీనస్ పార్టీ (బెర్సాటు) సోమవారం ప్రకటించింది.

మరోవైపు రాజకీయ గందరగోళాన్ని తీవ్రతరం చేస్తూ, మలేషియా ఆర్థిక వ్యవహారాల మంత్రి మొహమ్మద్ అజ్మిన్ అలీ, హౌసింగ్, స్థానిక ప్రభుత్వ మంత్రి జురైదా కమరుద్దీన్ ఇద్దరినీ సోమవారం అన్వర్ పీపుల్స్ జస్టిస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే వారికి మద్దతుగా మరో తొమ్మిది మంది శాసనసభ్యులు తమ విధేయతను ప్రకటించారు.. వారు పార్టీకి రాజీనామా చేశారు. చట్టసభ సభ్యుల ప్రకటన ప్రకారం. 11 మంది శాసనసభ్యులు పార్లమెంటులో స్వతంత్ర బ్లాక్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News