బారతీయుల పౌరసత్వ నిబంధనలలో మార్పులు చేసిన నేపాల్.. ఇకనుంచి ఏడేళ్లు..

బారతీయుల పౌరసత్వ నిబంధనలలో మార్పులు చేసినట్లు నేపాల్ హోంమంత్రి రామ్ బహదూర్ థాపా శనివారం చెప్పారు. కొత్త నిబంధన ప్రకారం, నేపాల్ పౌరుడిని వివాహం చేసుకునే ఏ భారతీయ స్త్రీ అయినా ఇప్పుడు ఏడు సంవత్సరాల వ్యవధి తరువాత పౌరసత్వం పొందుతుందని అన్నారు.

Update: 2020-06-20 14:36 GMT

బారతీయుల పౌరసత్వ నిబంధనలలో మార్పులు చేసినట్లు నేపాల్ హోంమంత్రి రామ్ బహదూర్ థాపా శనివారం చెప్పారు. కొత్త నిబంధన ప్రకారం, నేపాల్ పౌరుడిని వివాహం చేసుకునే ఏ భారతీయ స్త్రీ అయినా ఇప్పుడు ఏడు సంవత్సరాల వ్యవధి తరువాత పౌరసత్వం పొందుతుందని అన్నారు. వివాహం జరిగి ఏడు సంవత్సరాలు గడిచిన తరువాత మాత్రమే పౌరసత్వం ఇవ్వడానికి అనుమతించే భారతదేశ చట్టాన్ని అనుసరించి దీనిని తయారు చేసినట్టు ఆయన తెలిపారు. అయితే, భారత పౌరసత్వ చట్టం యొక్క ఈ నిబంధన నేపాల్‌కు వర్తించదని పేర్కొన్నారు.

కాగా భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా అనే మూడు వివాదాస్పద ప్రాంతాలను నేపాల్ మ్యాప్ లో చేర్చి ఇటీవల పార్లమెంట్ లో ఆమోదించారు. ఆ తరువాత భారతదేశం మరియు నేపాల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం విశేషం. భారత్-చైనా ప్రతిష్టంభనపై నేపాల్ తన స్పందన తెలియజేసింది. "దేశాల మధ్య వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని నేపాల్ పేర్కొంది. ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి కోసం నేపాల్ ఎప్పుడూ గట్టిగా నిలబడుతుంది అని పేర్కొంది.

 

Tags:    

Similar News