Tadipatri: పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్, వామపక్షాలు అసత్య ప్రచారం: బీజేపీ

పౌరసత్వ బిల్లుపై వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని బీజేపీ పట్టణ నాయకుడు ఆంజనేయులు ఆరోపించారు.

S. Srikanth
Published on: 29 Feb 2020 5:14 PM IST
Tadipatri: పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్, వామపక్షాలు అసత్య ప్రచారం: బీజేపీ
X

తాడిపత్రి: పౌరసత్వ బిల్లుపై వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని బీజేపీ పట్టణ నాయకుడు ఆంజనేయులు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ)పై అసత్య ప్రచారం చేస్తూ... ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం తీసేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని... దళితులకు మంచి అవకాశాలు ఇస్తూ, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. నీతి వంతమైన రాజకీయాలు చేసి ప్రజల హృదయాలను గెలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు, రూరల్ మండల అధ్యక్షుడు రాంబాబు, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రజాక్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story