సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది : ఆర్మీ చీఫ్ జనరల్

సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది : ఆర్మీ చీఫ్ జనరల్
x
army chief general mm naravane (File Photo)
Highlights

చైనా, నేపాల్‌తో కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నార్వాన్ ఒక ప్రకటన చేశారు.

చైనా, నేపాల్‌తో కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నార్వాన్ ఒక ప్రకటన చేశారు. మన సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని.. ఈ విషయంలో అందరికీ భరోసా ఇస్తున్నానని నార్వాన్ అన్నారు. కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయని.. స్థానిక స్థాయిలో సమాన హోదా కలిగిన కమాండర్ల సమావేశాలు కొనసాగుతున్నాయన్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఎ)లో పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొనడానికి నార్వాన్ శనివారం డెహ్రాడూన్‌కు వచ్చారు. ఈ సందర్బంగా ఈ ప్రకటన చేశారు.

నేపాల్‌తో భారత్ సంబంధం కూడా బలంగా ఉందని అన్నారు. ఆ దేశంతో భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక మరియు మత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇది మరింత బలపడుతుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించినంతవరకు పరిస్థితులు సాధారణం అని ఆయన జనరల్ అన్నారు. కాగా గత 10 నుంచి 15 రోజుల్లో 15 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories