Anthony Fauci: భారత్ అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది..
Anthony Fauci: భారత దేశం అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని అమెరికా వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫాసీ అన్నారు.
Anthony Fauci: భారత్ అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది..
Anthony Fauci: భారత దేశం అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని అమెరికా వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫాసీ అన్నారు. మరే దేశంలోనూ నమోదు కానంతటి అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయని తెలిపారు. భారత్‌లోని కరోనా వైరస్ లక్షణాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదని చెప్పారు అమెరికా అధ్యక్షుడి వైద్య సలహాదారు. ఈ వైరస్ రూపాల నుంచి కాపాడగలిగే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే విషయం ఇంకా పూర్తిగా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భారత దేశంలోని ఆరోగ్య వ్యవస్థతో కలిసి పని చేస్తోందని డాక్టర్ ఫాసీ వివరించారు.