H1B Visa: 40 శాతం తగ్గిన హెచ్‌-1బీ లాటరీ దరఖాస్తులు

H1B Visa: అమెరికా హెచ్‌-1బీ వీసా లాటరీ కోసం ఈ ఏడాది దాదాపు 40 శాతం తక్కువ దరఖాస్తులు వచ్చాయని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ ఆండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్ వెల్లడించింది.

Update: 2024-05-02 11:51 GMT

H1B Visa: 40 శాతం తగ్గిన హెచ్‌-1బీ లాటరీ దరఖాస్తులు

H1B Visa: అమెరికా హెచ్‌-1బీ వీసా లాటరీ కోసం ఈ ఏడాది దాదాపు 40 శాతం తక్కువ దరఖాస్తులు వచ్చాయని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ ఆండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్ వెల్లడించింది. 2023లో 7లక్షలా 58వేల 994 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 4లక్షలా 79వేల 342 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపింది. కాగా, దరఖాస్తు చేసిన ఉద్యోగాల సంఖ్య మాత్రం దాదాపుగా గత ఏడాదితో సమానంగా ఉంది.

ఇంతకుముందు హెచ్‌-1బీ లాటరీ కోసం మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకునే పద్ధతి ఉండేది. తర్వాత ఎలక్ట్రానిక్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే, కొన్ని కంపెనీలు, వ్యక్తులు ఈ పద్ధతిని దుర్వినియోగం చేసి డుప్లికేట్‌ దరఖాస్తులు చేస్తున్నారని యూఎస్‌సీఐఎస్‌ గుర్తించింది. దీంతో ఈసారి ఒక్కరు ఒకే దరఖాస్తు చేసే విధానాన్ని అమలు చేసింది. దీంతో దరఖాస్తులు భారీగా తగ్గినట్టు భావిస్తున్నారు.

Tags:    

Similar News