Viral Video: విమానానికి పక్షి ఢీకొని మంటలు... ఎమర్జెన్సీ ల్యాండింగ్ దృశ్యాలు వైరల్

FedEx cargo plane catches fire due to bird strike: విమానం గాల్లో ఉండగానే మంటలు అంటుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

Update: 2025-03-02 08:58 GMT

Viral Video: విమానానికి పక్షి ఢీకొని మంటలు... ఎమర్జెన్సీ ల్యాండింగ్ దృశ్యాలు వైరల్

Flight catches fire due to bird hit


ఫెడ్ఎక్స్ కార్గో విమానానికి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొని మంటలు అంటుకున్నాయి. అమెరికాలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పైలట్ విమానాన్ని మళ్లీ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చి సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

బోయింగ్ 767-3S2F విమానం ఉదయం 8 గంటలకు టేకాఫ్ అయింది. కొన్ని నిమిషాల్లోనే పక్షి ఢీకొని కుడివైపు ఉన్న ఇంజన్లో మంటలు తలెత్తాయి. ఇంజన్లో మంటలు అంటుకోవడం గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరుతూ నెవార్క్ లిబర్టీ ఎయిర్ పోర్టుకు సమాచారం అందించారు.

పైలట్ అందించిన సమాచారంతో విమానాశ్రయం ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఫైర్ ఇంజన్లతో రెడీగా ఉండి రన్ వే క్లియర్ చేసి పెట్టారు. విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విమానం గాల్లో ఉండగానే మంటలు అంటుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.     

Tags:    

Similar News