Elephant Mosquitoes: చైనాలో వైరస్‌పై యుద్ధానికి రంగంలోకి ఎలిఫెంట్‌ దోమలు..!

Elephant Mosquitoes: గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో నెలలోనే 7,000 గన్యా కేసులు — సైనిక చర్యతో పాటు బయోలాజికల్‌ దోమలతో పోరాటం

Update: 2025-08-06 10:00 GMT

Elephant Mosquitoes: చైనాలో వైరస్‌పై యుద్ధానికి రంగంలోకి ఎలిఫెంట్‌ దోమలు..!

Elephant Mosquitoes: చైనాలో మరోసారి వైరస్‌ ఉధృతి కనిపిస్తోంది. దక్షిణ చైనా ప్రావిన్స్‌ గ్వాంగ్‌డాంగ్‌లోని ఫోషన్‌ నగరంలో గన్యా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గత 20 ఏళ్లలో ఇటువంటి తీవ్రమైన పరిస్థితి రావడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 2008లో ఈ స్థాయిలో వ్యాప్తి నమోదైంది.

ఇప్పటి వరకు అక్కడ నెల రోజుల వ్యవధిలో 7,000 పైగా గన్యా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో రక్షణ చర్యలు ప్రారంభించింది. కరోనా సమయంలో అమలులోకి తెచ్చిన ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టింది. వీధుల్లో ఫాగింగ్‌ నిర్వహించడంతో పాటు, దోమల పెరుగుదలపై పట్టు సాధించేందుకు ప్రత్యేక డ్రోన్లను వినియోగిస్తోంది.

ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి బయోలాజికల్‌ ఆయుధాలు కూడా తోడవుతున్నాయి. అందులో భాగంగా, శాస్త్రవేత్తలు ‘ఎలిఫెంట్‌ మస్కిటో’గా పిలిచే పెద్దదొమ్ములను రంగంలోకి దింపారు. ఇవి సాధారణ దోమల గుడ్లను తినేసి వాటి పెరుగుదలని అడ్డుకుంటాయి. ఇవి ‘టెక్సోరెంకైటిస్‌’ అనే శాస్త్రీయ నామంతో పిలవబడతాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో విస్తృతంగా కనిపించే ఈ దోమలు దాదాపు 90 రకాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల దాకా పెరుగుతాయి.

సాధారణ దోమల మాదిరిగానే ఇవి నీటిమీద గుడ్లు పెడతాయి. కాని ప్రత్యేకత ఏమిటంటే.. వీటి లార్వాలు ఇతర దోమల గుడ్లను తినేస్తాయి. ఒక్క లార్వా కనీసం 100 దోమల గుడ్లను తినగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో ఇతర దోమల జననాన్ని తగ్గించేందుకు ఇవి సహాయపడతాయి.

ఇంతేకాదు, ఈ దోమలతోపాటు ప్రత్యేక రకమైన దోమల్ని తినే చేపలను కూడా స్థానిక కాలువల్లో వదిలారు. మొత్తం 5,000 చేపలను వదిలినట్టు సమాచారం.

యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2,40,000 గన్యా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 90 మరణాలు సంభవించాయి. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాల్లో వైరస్‌ తీవ్రంగా వ్యాపించింది.

Tags:    

Similar News