Donald Trump: అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోంది
Donald Trump: అమెరికా బంగారు భవిష్యత్ కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు.
Donald Trump: అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోంది
Donald Trump: అమెరికా బంగారు భవిష్యత్ కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు. పోలింగ్ తర్వాత తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందన్నారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. కొత్త చట్టాలు తెచ్చేందుకు ఇబ్బందులు రావన్నారు. తన విజయంలో మెలానియా కీలకపాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు. వేదికపైనే ప్రసంగించారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.సరిహద్దులు మూసివేస్తాం... అక్రమ వలసలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు.ఎవరైనా చట్టబద్దంగానే దేశంలోకి రావాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు.
వేదికపైనే భార్యకు ముద్దు పెట్టిన ట్రంప్
ఈ ఎన్నికల్లో తన భార్య మెలానియా ఎంతో కష్టపడ్డారని ట్రంప్ చెప్పారు. ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసి ఆమెకు ముద్దు పెట్టారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్నికల కోసం ఎలా పనిచేశారో ఆయన గుర్తు చేసుకున్నారు. అందరి శ్రమతోనే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వీడియో: