Donald Trump: భారత్‌కు మంచి ప్రధాని ఉన్నారు.. మోదీ చాలా తెలివైన వ్యక్తి: డోనాల్డ్‌ ట్రంప్

Donald Trump Comments on PM Modi: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Update: 2025-03-29 09:48 GMT

Donald Trump: భారత్‌కు మంచి ప్రధాని ఉన్నారు.. మోదీ చాలా తెలివైన వ్యక్తి: డోనాల్డ్‌ ట్రంప్

Donald Trump Comments on PM Modi: భారత్‌కు మంచి ప్రధాని ఉన్నారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు పీఎం నరేంద్ర మోదీపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అంతేకాదు ఢిల్లీ, వాషింగ్టన్‌ డీసీ మధ్య సుంకాలు బాగా పనిచేయనున్నాయని.. అనుకూలమైన ఫలితాలు కూడా లభిస్తాయని ఆశిస్తున్నట్లు శుక్రవారం న్యూజెర్సీ అమెరికా న్యాయవాది అలీనా హబ్చా ప్రమాణస్వీకారం తర్వాత మీడియాతో ట్రంప్‌ వ్యాఖ్యనించారు.

అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశంసించారు. నాకు మోదీ మంచి స్నేహితుడు, ఈ మధ్య మోదీ ఇక్కడి వచ్చారు.. చాలా తెలివైన వ్యక్తి అన్నారు డోనాల్డ్‌ ట్రంప్‌. అయితే, భారత్‌ అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి అని చెప్పారు. ఇక భారత్‌ తమ దేశంలో చాలా బాగా కలిసి పనిచేస్తుందని భావిస్తున్నా అన్నారు.

ఇక ఈ వారంలో ట్రంప్‌ అమెరికాలోకి రానున్న అన్ని దిగుమతులపై 25 శాతం వాహన సుంకాలను ప్రకటించారు. ఇది దేశీయ తయారీకి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని అభివర్ణించారు. ఏప్రిల్‌ 2 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా బ్రాండ్‌లతోపాటు ఇతర దేశాల్లో అసెంబుల్‌ అయిన అన్ని వాహనాలు అమెరికాలో విక్రయిస్తే దాదాపు సగానికి పైగా ప్రభావం పడుతుంది.

ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం జరిపిన వెంటనే భారత్‌తోపాటు చైనా, బ్రేజిల్‌, మెక్సికో వంటి దేశాలపై పరస్పర సుంకాలు (Reciprocal tax) విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక భారత్‌ 100 శాతం కంటే ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు. ప్రధానంగా ఆటోమొబైల్‌ దిగుమతులపై భారత్‌ విధిస్తున్న సుంకాలను ఉద్దేశించి ట్రంప్‌ మాట్లాడారు. అంతేకాదు ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి దేశం తమ దేశాన్ని ఏదో విధంగా దోచుకుందని, ఇకపై అలాంటి వాటికి తావు ఉండదని ప్రసంగించారు.

Tags:    

Similar News