Xi Jinping: ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్.. తెగించి పోరాడితేనే..
Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు.
Xi Jinping: ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్.. తెగించి పోరాడితేనే..
Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు. బీజింగ్‌లోని 'గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్'లో వారం రోజులపాటు జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాలలో భాగంగా ఆయనను మరో 5 ఏళ్లపాటు దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈమేరకు పార్టీ అగ్ర నాయకత్వంలో మార్పులు, చేర్పులకు ఆమోదం తెలుపుతూ పార్టీ ముఖ్యప్రతినిధులు సంతకాలు చేశారు. అయితే సెంట్రల్ కమిటీ తొలి సమావేశం జరిగిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా జీ జిన్‌పింగ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆయన మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
మార్చిలో జరిగే ప్రభుత్వ వార్షిక లెజిస్లేటివ్ సెషన్స్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుంది. ఇదిలా ఉంటే చైనా అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టడానికి అనుమతినిచ్చే నిబంధనలను జీ జిన్‌పింగ్ 2018లో రద్దు చేశారు. దీంతో మూడోసారి ఆ పదవిని చేపట్టడానికి ఆయనకు మార్గం సుగమమైంది. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సమావేశాల ముగింపు సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. తెగింపుతో పోరాడాలని, సాహసంతో గెలవాలని పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితులకు చలించిపోకుండా కఠోర శ్రమతో పని చేసి దృఢసంకల్పంతో ముందుకు దూసుకెళ్ళాలన్నారు.