చైనాలో మళ్ళీ కరోనా విజృంభణ..

చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుందా? అంటే పరిస్థితి అలాగే కనిపిస్తోంది.

Update: 2020-04-12 06:19 GMT
Representational Image

చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుందా? అంటే పరిస్థితి అలాగే కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకూ పెద్దగా కేసులు నమోదు కాలేదు కానీ ఏప్రిల్ 11న 99 కొత్త కరోనావైరస్ కేసులునమోదయ్యాయని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.. మార్చి 6 నుండి కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. శుక్రవారం నమోదైన 33 కేసులు నమోదైతే.. శనివారం 99 నమోదయ్యాయి.. అయితే ఆదివారం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం ఈ కేసులు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చినవి కావు. 99 కేసుల్లో రెండు మాత్రమే స్థానికంగా నమోదయ్యాయి అని చెబుతోంది.

ఇందులో ఎక్కువగా చైనా వాణిజ్య కేంద్రమైన షాంఘై లో నమోదయ్యాయి. ఏప్రిల్ 11 న నగరంలో 52 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, వీరిలో విదేశాలలో ప్రయాణించిన చైనా పౌరులు ఉన్నారనీ షాంగై మునిసిపల్ హెల్త్ కమిషన్ ఆదివారం తెలిపింది. శనివారం ఈ 99 కేసులు తప్ప దేశంలో ఎక్కడా కొత్త కేసులు నమోదు కాలేదని చైనా వెల్లడించింది. కాగా కరోనాకు నిలయమైన వుహాన్ నగరంలో లాక్ దేవన ఎత్తి వేశారు. ప్రస్తుతం అక్కడ ప్రజలు సాధారణ జీవనాన్ని గడుపుతున్నారు.



Tags:    

Similar News