చైనాలో రెండోదఫా 'కరోనావైరస్' విజృంభణ మొదలైందా..?

కరోనావైరస్ కు కేంద్ర బిందువైన వుహాన్ లో రెండో దఫా వైరస్ విజృంభణ మొదలైందా..? కేసులు మరోసారి పెరగనున్నాయా..? పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉంది.

Update: 2020-05-13 05:27 GMT

కరోనావైరస్ కు కేంద్ర బిందువైన వుహాన్ లో రెండో దఫా వైరస్ విజృంభణ మొదలైందా..? కేసులు మరోసారి పెరగనున్నాయా..? పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉంది.. దాదాపు చైనాలో 60 శాతం కేసులు వుహాన్ నుంచే నమోదయ్యాయి. నిన్నమొన్నటివరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకున్నారు. సాధారణ జనజీవనం తిరిగి ప్రారంభం అయింది. ఇక కరోనా పోయిందిలే అనుకున్నారు.. ఈ తరుణంలో వుహాన్ నగరంలో 6 కొత్త కేసులు రావడంతో ఆందోళన మొదలయింది, ప్రభుత్వ మీడియా ఈ కేసులను ద్రువీకరించడమే కాక ఆందోళనను వ్యక్తం చేసింది.

ఇప్పుడు వుహాన్ పౌరులందరికి కరోనా పరీక్షలు చెయ్యాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. వుహాన్ జనాభా 11 మిలియన్లు. కరోనా కారణంగా రెండు నెలలు వుహాన్ నగరం లాక్డౌన్ ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో చైనా అంతటా కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. ఇందులో 15 కేసులలో, లక్షణాలు కనిపించలేదు. ఇదిలావుంటే చైనాలో మొత్తం 83 వేలకు పైగా కేసులు, 4 వేలకు పైగా మారణాలు సంభవించాయి.. ఇక దాదాపు 70 వేలమంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు.

Tags:    

Similar News