United Kingdom లో ఆ సంఖ్య మరీ తక్కువ.. సినిమాలు చూస్తున్న ప్రధాని

యునైటెడ్ కింగ్‌డమ్‌లో కరోనావైరస్ వ్యాప్తితో మరణించిన వారి సంఖ్య 10,000 మార్కును చేరుకోబోతోంది.

Update: 2020-04-12 03:19 GMT
Representational Images

యునైటెడ్ కింగ్‌డమ్‌లో కరోనావైరస్ వ్యాప్తితో మరణించిన వారి సంఖ్య 10,000 మార్కును చేరుకోబోతోంది. ఆరోగ్య అధికారులు శనివారం మరో 917 ఆసుపత్రి మరణాలను నివేదించారు. మొత్తం 9,875 మరణాలు ఉన్నట్టు నివేదించింది. ఇక కేసుల సంఖ్య 78,991 గా ఉంది. ఇందులో కోలుకున్నవారి సంఖ్య మాత్రం మరింత తక్కువగా ఉంది. కేవలం 344 మంది మాత్రమే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు మూడు ఓజులపాటు ఇంటెన్సివ్ కేర్‌లో ఉండి..

ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారని uk ఆరోగ్య శాఖ తెలిపింది. "ప్రధాన మంత్రి చాలా మంచి పురోగతి సాధిస్తున్నారు" అని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

అంతేకాదు సినిమాలు చూస్తున్నానని, గర్భిణీ కాబోయే క్యారీ సైమండ్స్ పంపిన లేఖలను కూడా చదువుతున్నానని బ్రిటీష్ వార్తాపత్రికలు పేర్కొన్నాయి. కాగా మార్చి 27 న పదానికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News