Coronavirus: ఈ రెండు దేశాలకు శుభవార్త..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది.

Update: 2020-04-13 03:25 GMT
Representational Image

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. అయితే కొద్దిరోజుల క్రితం ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇప్పుడు క్రమంగా మందగిస్తుంది. గత రెండు రోజులుగా తక్కువ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దాంతో ఈ దేశాల ప్రజలు ప్రస్థుతం కుదుటపడుతున్నారు.

ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం మార్చి 19 నుండి అతి తక్కువ కరోనావైరస్ మరణాలను నివేదించింది, గత 24 గంటల్లో 431 మరణాలు నమోదయ్యాయి, అంతకుముందు రోజు ఈ సంఖ్య 619 గా ఉంది. ఇక కేసుల విషయానికొస్తే దేశంలో మొత్తం 156,363 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. అందులో 19,899 మంది మరణించగా.. 34,211 మంది కోలుకున్నారు.

మరోవైపు ఫ్రాన్స్ లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కోనసాగుతోంది. అక్కడ కూడా వైరస్ కారణంగా మరణాలు తగ్గుముఖం పట్టాయి.. ఆదివారం ఫ్రాన్స్ ఆసుపత్రిలలో 315 మరణాలు సంభవించాయని.. ఫ్రాన్స్ జాతీయ ఆరోగ్య కేంద్రం నివేదించింది, ఈ సంఖ్య అంతకు ముందు రోజు అంటే శనివారం 345 గా ఉంది. ఇక ఫ్రాన్స్ దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 132,591 నమోదవ్వగా.. ఇందులో 14,393 మంది మరణిస్తే.. 27,186 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇదిలావుంటే జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ద్వారా 114,000 మందికి పైగా మరణించారు, దాదాపు 422,000 మంది కోలుకున్నారు. 1,853,155 మందికి ఈ వ్యాధి సోకింది.


Tags:    

Similar News