మరణాలు పెరిగినా.. స్పెయిన్ కు ఊరట కలిగించేది ఇదే..

గత వారం కిందటి వరకూ.. స్పెయిన్ లో కరోనా వైరస్ విజృంభించిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-08 12:19 GMT

గత వారం కిందటి వరకూ.. స్పెయిన్ లో కరోనా వైరస్ విజృంభించిన సంగతి తెలిసిందే.గత వారం కిందటి వరకూ.. స్పెయిన్ లో కరోనా వైరస్ విజృంభించిన సంగతి తెలిసిందే.. రెండు రోజుల కిందట కేసులు , మరణాల సంఖ్య మందగించినా మళ్ళీ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 757 మంది మరణించారు.

దాంతో బుధవారం రెండవ రోజు వరుసగా స్పెయిన్లో రోజువారీ కరోనావైరస్ మరణాల సంఖ్య పెరిగిందని ఆరోగ్య అధికారులు తెలిపారు, అయితే గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్యలో రోజువారీ వేగం కొద్దిగా తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దీంతో స్పెయిన్లో కరోనావైరస్ వలన సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 14,555 కు పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం మరణాల సంఖ్యలో రోజువారీ పెరుగుదల బుధవారం 5.7 శాతంగా ఉంది, అంతకు ముందు రోజు 743 మంది మరణించారు అప్పుడు 5.5 శాతం మరణాల రేటు ఉంది.

మరోవైపు కేసులు కూడా 146.690 కు చేరుకున్నాయి. ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏమిటంటే 45 వేలకు పైగా రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. యూకే లో మాత్రం 55 వేల పాజిటివ్ కేసులు నమోదైతే కేవలం 145 మంది మాత్రమే కోలుకున్నారు.

Tags:    

Similar News