Coronavirus : ఆసుపత్రిలో చేరిన UK పీఎం బోరిస్ జాన్సన్

యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ కు 10 రోజుల కిందట కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-06 03:35 GMT
British PM Boris Johnson

యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ కు 10 రోజుల కిందట కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటిదాకా ఆయన తన హోమ్ ఖ్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో 10 రోజుల తరువాత కరోనావైరస్ యొక్క లక్షణాలు మరింతగా ఎక్కువ అవ్వడంతో ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఈ విషయాన్నీ వెల్లడించింది. ఇది "ముందు జాగ్రత్త చర్య", అత్యవసర ప్రవేశం కాదు. అని పేర్కొంది. "తన వైద్యుడి సలహా మేరకు, ప్రధాని ఈ రాత్రి పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు" అని డౌనింగ్ స్ట్రీట్ ఆదివారం పేర్కొంది.

ఇది ముందు జాగ్రత్త చర్యలో భాగం.. ఇప్పటికే ప్రధాన మంత్రి 10 రోజులుగా కరోనా తో పోరాడుతున్నారు.. అందువల్ల ఆయన వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరారు అని స్పష్టం చేసింది. కాగా మార్చి 27 న, తనకు కరోనా వైరస్ సోకిందని స్వయంగా జాన్సన్ వెల్లడించారు. ప్రస్తుతం వైరస్ భారిన పడినా ఆయన అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.. 10 రోజులుగా ఒంటరిగా ఉంటూ అనేక వీడియో సందేశాలను విడుదల చేశారు. శుక్రవారం ఒక సందేశంలో, తనకు ఆరోగ్యం బాగానే ఉందని, ఇంకా జ్వరం ఉందని చెప్పారు.


Tags:    

Similar News