చైనాను ముంచేయనున్న 3 కోవిడ్ సునామీలు.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం..
చైనాను ముంచేయనున్న 3 కోవిడ్ సునామీలు.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం..
చైనాను ముంచేయనున్న 3 కోవిడ్ సునామీలు.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం..
China: కిటకిటలాడుతున్న ఆసుపత్రులు.. తమను చేర్చుకోవాలంటూ ఆసుపత్రుల ఎదుట భారీ క్యూలు.. స్మశానాల్లో భారీగా పొగలు.. గుండెలను పిండేసేలా ఆక్రందనలు.. ఇవన్నీ వింటుంటే.. మన దేశంలో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో దృశ్యాలు కళ్ల ఎదుట కదులుతాయి. కోవిడ్ మొదటి దశలో మన దేశంలో కనిపించిన ఈ దృశ్యాలే.. ఇప్పుడు చైనాలో కనిపిస్తున్నాయి. కోవిడ్ ఆంక్షలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఉన్నట్టుండి జీరో కోవిడ్ పాలసీని బీజింగ్ రద్దు చేసింది. దీంతో డ్రాగన్ కంట్రీలో వైరస్ సునామీని సృష్టిస్తోంది. దీనికే చైనా ప్రజలు అల్లాడుతుంటే.. వారి నెత్తిన బీజింగ్ మరో బాంబు వేసింది. ఒకటికి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు వేవ్‌లు... వచ్చే మూడు నెల్లలో చైనాను ముంచెత్తనున్నాయట. దీంతో చైనీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు
కరోనా వైరస్‌ను ప్రపంచంపైకి వదిలిన చైనా.. ఇప్పుడు ఆ ఉచ్చులో తనే చిక్కుకుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా భావించిన జీరో కోవిడ్ పాలసీని తొలగించారు. దీంతో అక్కడ వైరస్ సునామీ సృష్టిస్తోంది. డ్రాగన్ కంట్రీలో ఏ ఆసుపత్రి చూసినా.. రోగులతో కిటకిటలాడుతోంది. స్మశానాలు జనాలతో వెలువెత్తుతున్నాయి. వేలాది మృతదేహాలను ట్రక్కుల్లో స్మశానవాటికలకు తరలిస్తున్నారు. కానీ.. అధికారికంగా మాత్రం ఇద్దరు మృతి చెందినట్టు బీజింగ్ ప్రకటించింది. కోవిడ్ ట్రాకింగ్ యాప్‌ను తొలగించడంతో కేసుల సంఖ్యను చెప్పడం అసాధ్యమంటూ ఇప్పటికే తెలిపింది. వైరస్‌ను కట్టడి చేయడంలో జిన్‌పింగ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో కరోనా రక్కసి విలయతాండవం ఆడుతోంది. తాజాగా చైనాలో ఏ ఆసుపత్రిని చూసినా.. వైరస్ బాధితులతో కిటకిటటాడుతోంది. ఆసుపత్రుల ఎదుట భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక ఐసీయూ వార్డులను ఏర్పాటు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే.. అక్కడ చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు స్మశానాల్లో 24 గంటల పాటు అంత్యక్రియలు సాగుతున్నాయి. ఇప్పుడే వేవ్ మొదలయ్యిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. షాపులు, కార్యాలయాలు మూతపడుతున్నాయి. నగరాల్లోని రహదారులన్నీ నిర్మానుణ్యంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు చైనీయులు భయాందోళనతో వణుకుతున్నారు. వచ్చే మూడు నెలల్లో మూడు వేవ్‌లు డ్రాగన్ కంట్రీని ముంచెత్తనున్నాయట. ఈ ప్రకటన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థనో, లేక.. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థనో కాదు.. స్వయంగా చైనా అంటువ్యాధుల నిపుణుడు వు ఝున్యూ హెచ్చరించాడు. ఇప్పటికే మొదటి వేవ్ మొదలైందని.. ఇది డిసెంబరు నుంచి.. జనవరి మధ్యలో ముగుస్తుందట. ప్రస్తుతం పెరుగుతున్న కేసులతో సతమతవుతోంది. జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు రెండో వేవ్ రానున్నట్టు వెల్లడించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో లక్షల మంది చైనీయులు సొంత ఊర్లకు వెళ్తారు. దీంతో వైరస్ దేశమంతటా వ్యాపించే ప్రమాదం ఉందని ఝున్యూ తెలిపారు. సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చే వారితో కొత్త వేరియంట్ సోకి.. మూడో వేవ్ వస్తుందన్నారు. అంటే.. మధ్య ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని అంటువ్యాధుల నిపుణుడు వివరించారు. మొత్తంగా మూడు వేవ్‌లతో 60 శాతం మంది చైనీయులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా మొత్తం జనాభా 140 కోట్ల మంది కాగా.. వారిలో 80 కోట్ల మందికి వైరస్ సోకననున్నదట. ఈ లెక్కన వైరస్ బారిన పడి.. లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చైనా అధ్యక్షుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో కోవిడ్ పాలసీ ఫెయిల్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి తాజా వైరస్ విలయానికి జీరో కోవిడ్ పాలసీనే కారణమంటున్నారు నిపుణులు. మొదటి నుంచి వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు అనుసరించిన పద్దతులను చైనా పాటించి ఉంటే ముప్పు తక్కువగా ఉండేదని చెబుతున్నారు.
చైనా ఆర్థిక రాజధాని షాంఘై.. నిర్మాణుష్యంగా మారింది. స్కూళ్లు మూతబడ్డాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. షాంఘైలోని స్కూళ్ల ఉపాధ్యాయులు, సిబ్బంది పూర్తిగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. షాంఘైలో 2 లక్షల 30వేల ప్రత్యేక బెడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ రాజధాని బీజింగ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. జిమ్‌లు, స్టేడియంలను ఆసుపత్రులుగా మారుస్తున్నారు. వేలాది మంది ప్రజలు చికిత్సకోసం ఎదురుచూస్తున్నారు. 2020 తరువాత.. బీజింగ్‌లో పరిస్థితులు విషమించినట్టు తెలుస్తోంది. ఈ నగరంలో అంత్యక్రియలు 24 గంటల పాటు సాగుతున్నాయి. భారీగా ట్రక్కులు, వాహనాల్లో మృతదేహాలను తరలిస్తున్నారు. ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని మాత్రం బీజింగ్ వెల్లడించడం లేదు. ఒక్క బీజింగ్‌లోనే వారం క్రితం 30 అంత్యక్రియలు జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి బీజింగ్ ఇలాంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు పొక్కనీయదు. ఇప్పుడు కూడా.. డ్రాగన్ కంట్రీ వివరాలను దాచిపెడుతోంది. కేసుల సంఖ్యను, మృతుల వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తోంది. అక్కడి ప్రజలు కూడా చెప్పడానికి సందేహిస్తున్నారు. కానీ పరిస్థితులు విషమంగా ఉన్నాయనడానికి హాంగ్‌కాంగ్ పరిణామాలే నిదర్శనం. హాంకాంగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. జ్వరం, నొప్పి నివారణ మాత్రలు, కోవిడ్ టెస్ట్ కిట్లనే అధికంగా కొంటున్నారు. కొందరు చైనాలోని తమ కుటుంబీకులకు పంపుతున్నరు. మరి కొందరు మాత్రం స్టాక్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామాలతో డ్రాగన్ బయటకు చెప్పేది ఒకటి.. లోపల జరుగుతున్నది మరొకటని స్పష్టంగా తెలుస్తోంది.
2020 ప్రారంభంలోనే ప్రపంచ దేశాలు వైరస్ బారిన పడ్డాయి. 2020 డిసెంబర్ నాటికి వైరస్ విలయతాండవం ఆడింది. కానీ.. చైనాలో మాత్రం అలాంటి దాఖలాలు కనిపించలేదు. కానీ.. 2021 డిసెంబరులో బీజింగ్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జీరో కోవిడ్ పాలసీతో వైరస్‌కు అడ్డుకట్ట వేసింది. 2022 డిసెంబరులోనూ మరో వేవ్ మొదలయ్యింది. గతేడాది కంటే పరిస్థితులు ఈసారి మరింత దారుణంగా ఉన్నాయి. 2019 డిసెంబరులోనూ కరోనా వేవ్ మొదలయ్యినట్టు రికార్డులు చెబుతున్నాయి. కానీ.. చైనా మాత్రం ఈ విషయం బయటపెట్టడం లేదు. 2013 నుంచి చైనా మరణాల రేటును పరిశీలిస్తే.. అసలు విషయం తెలుస్తుంది. 2013 నుంచి 2018 వరకు మరణాల రేటు.. 0.3 శాతమే మాత్రమే ఉండేది. అసలు 0.4 శాతానికి కూడా మించలేదు. అలాంటిది.. 2019 నుంచి ఏకంగా 1.9 శాతానికి పెరిగింది. ఈ మూడేళ్ల కాలంలో ఏటా కోటి మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ లెక్కన రోజుకు 27వేల మంది చనిపోయారు. ప్రతి వెయ్యి మందికి గానూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు రికార్డుల చెబుతున్నాయి. నిజానికి కరోనా వైరస్ 2019 అక్టోబరులోనే వూహాన్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందన్న వాదనలు ఉన్నాయి. మూడేళ్ల చైనా మరణాల రేటును చూస్తే.. అదే నిజమనిపించేలా ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని చైనా మాత్రం అంగీకరిండం లేదు. 2019 నుంచి కరోనా కట్టడికి.. జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని తెచ్చింది. అత్యంత క్రూరమైన ఈ పాలసీని ఎత్తేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. జిన్‌పింగ్ దిగిపోవాలని నినదించింది. దీంతో జిన్‌పింగ్ ప్రభుత్వం కోవిడ్ పాలసీని ఎత్తేసింది. కోవిడ్ పాలసీని తొలగించిన తరువాత.. కేసులు ఉధృతమయ్యాయి. క్రమంగా ఆంక్షలను ఎత్తేయకుండా.. ఒకేసారి పూర్తిగా తొలగించడంతోనే.. కేసులు భారీగా పెరుగుతన్నాయి. ఇప్పుడు ఈ చర్యతోనే చైనీయులు భయాందోళనకు గురవుతున్నారు.