America - China: తైవాన్ అంశంపై బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన జిన్‌పింగ్

America - China: తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికన్లు ప్రోత్సహిస్తే.. నిప్పుతో చెలగాటం ఆడుకున్నట్లే

Update: 2021-11-16 13:06 GMT
అమెరికా అధ్యక్షునికి వార్నింగ్ ఇచ్చిన జిన్ పింగ్ (ఫైల్ ఇమేజ్)

America - China: ఇవాళ జరిగిన అమెరికా-చైనా అధినేతల వర్చువల్ భేటీ జిన్‌పింగ్ వార్నింగ్ కామెంట్స్‌తో హాట్‌టాపిక్ అవుతోంది. గతంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఇలాంటి భేటీలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజా భేటీలో జిన్‌పింగ్ రివర్స్ అయ్యారు. తైవాన్ అంశంపై ఏకంగా అగ్రరాజ్యం అద్యక్షుడు జో బైడెన్‌కే వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికన్లు ప్రోత్సహించడం అంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అని హెచ్చరించారు.

ఈ కీలక భేటీలో మొదట ఇద్దరు నేతలు వ్యక్తిగత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన వివాదాన్ని ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తైవాన్‌పై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ కోసం అక్కడి అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం చాలా ప్రమాదం అని వ్యాఖ్యానించారు. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో వారు భస్మం కావడం ఖాయమన్నారు.

మరోవైపు.. చైనా అధ్యక్షుడి ఆరోపణలను బైడెన్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. తాము ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు గానీ, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు సృష్టించడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఒక్కతైవాన్ అంశంలో తప్ప మిగిలిన విషయాల్లో భేటీ సామరస్యపూర్వక వాతావరణంలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు సమస్యలను సంయుక్తంగా పరిష్కరించాలని చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ కోరినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News