Coronavirus: కరోనా తొలి పేషెంట్ ను గుర్తించిన చైనా

ప్రపంచంలో కరోనా వైరస్​ సోకిన మొదటి బాధితురాలిని గుర్తించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మూల బిందువుని గుర్తించారు.

Update: 2020-03-31 03:04 GMT
Representational Image

ప్రపంచంలో కరోనా వైరస్​ సోకిన మొదటి బాధితురాలిని గుర్తించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మూల బిందువుని గుర్తించారు. చైనాలోని వూహాన్ లో సీమార్కెట్ లో రొయ్యలు అమ్ముకుని జీవించే 57 ఏళ్ల మహిళను '​ పేషెంట్ జీరో'గా గుర్తించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ జరిపిన పరిశోధనలో తేలింది.

కరోనా వైరస్ తొలి బాధితులలో ఆమెను ఒకరిగా గుర్తించారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పరిశోధనలో.. వూహాన్ సీఫుడ్ మార్కెట్లో రొయ్యలను అమ్ముకునే ' వీ గుక్సియన్ 'అనే మహిళకు డిసెంబర్ 10 న జలుబు వచ్చింది. ఆమె తనకు సాధారణ ఫ్లూ భావించి, చికిత్స కోసం స్థానిక క్లినిక్‌కు వెళ్లగా.. అక్కడ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చారు. అయినప్పటికీ, వీ గుక్సియన్ బలహీనంగా మారింది. దీంతో వీ వూహాన్ నగరంలోని అతిపెద్ద యూనియన్ ఆసుపత్రిలో డిసెంబర్ 16 చికిత్స కోసం చేరింది. అయితే అప్పటికే ఉవానన్ మార్కెట్ నుంచి చాలా మంది ఇదే తరహా లక్షణాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

వి గుక్సియన్ ఆసుపత్రిలో నెలరోజుల చికిత్స తీసుకున్న అనంతరం జనవరిలో పూర్తిస్థాయిలో కోలుకుని తన నివాసానికి చేరుకుంది. అయితే తానే తొలి కరోనావైరస్ రోగి అనే విషయం ఆమెకు ఈమధ్యే తెలియడం గమనార్హం. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా గంటగంటకు మరణ మృదంగం మోగుతుంది ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి 37,814 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తం 7,85,715 మందికి ఈ వైరస్ సోకింది. ఇటలీ, అమెరికా, ఇరాన్, వంటి దేశాల్లో ఈ వైరస్ కేసుకు అధికంగా ఉన్నాయి. ఇక మనదేశంలో కోవిడ్ కేసులు వెయ్యి దాటాయి.


Tags:    

Similar News