British Royal Residence: బ్రిటీష్ రాజభవనం ఖరీదెంత?

Buckingham Palace: ప్రపంచాన్నే ఏలిన బ్రిటీష్‌ రాజసానికి గుర్తుగా ఉన్న బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో రాయల్‌గా గడపాలనుకుంటున్నారా?

Update: 2022-05-31 10:15 GMT

British Royal Residence: బ్రిటీష్ రాజభవనం ఖరీదెంత?

Buckingham Palace: ప్రపంచాన్నే ఏలిన బ్రిటీష్‌ రాజసానికి గుర్తుగా ఉన్న బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో రాయల్‌గా గడపాలనుకుంటున్నారా? అయితే అందుకు మీ దగ్గర 130 కోట్ల పౌండ్లు ఉండాల్సందే. అయితే బ్రిటన్‌కు చెందిన భవనాల విక్రయ సంస్థ మెక్‌‌ క్యార్తీ తాజాగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ధరను లెక్కగట్టింది. లండన్‌లోని 775 గదులున్న చారిత్రక భవనం విలువ 130 కోట్ల పౌండ్లుగా ప్రకటించింది. కోవిడ్‌ తరువాత అదనంగా ప్యాలెస్‌ విలువ 10 కోట్ల పౌండ్లు పెరిగినట్టు తెలిపింది. యూకేలోని రాజ ప్రసాదాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోటలు, లాడ్జీల విలువను కూడా లెక్కించింది. 2022లో వాటి విలువ 370 కోట్ల పౌండ్లకు చేరుకున్నట్టు వివరించింది. 2019 నుంచి ఇప్పటివరకు 46 కోట్ల పౌండ్లు పెరిగినట్టు స్పష్టం చేసింది.

బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌తో పాటు బ్రిటన్‌లోని కోటలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. బహింగ్‌హామ్‌ ప్యాలెస్‌ను రాజకుటుంబీకులు వాడుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. వారికి ఆయా ఆస్తులపై ఎలాంటి హక్కులూ లేవు. ఒకవేళ బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ విక్రయిస్తే ఎంత ధర ఉండొచ్చనే అంశంపై మాత్రమే ఈ విలువలను లెక్కగట్టింది. రాజ ప్రసాదాన్ని అద్దెకు నెలకు 26 లక్షల పౌండ్లు చెల్లించవచ్చని మెక్‌ క్యార్తీ సంస్థ తెలిపింది. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ కట్టడాలను అద్దెకు, అమ్మకానికి అవకాశం లేదు. అవి ప్రజల ఆస్తిగా ప్రకటించబడింది. వచ్చే వారం రాణి ఎలిజబెత్‌ ప్లాటినం జూబ్లీ వేడుక నిర్వహించనున్న తరుణంలో మెక్‌ క్యార్తీ ఆస్తుల విలువ కట్టడం విశేషం. 

Tags:    

Similar News