Australia: ఆంక్షలు సడలించిన ఆస్ట్రేలియా.. విమాన ప్రయాణాలకు ఓకే

Australia: భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ తో భారీగా కేసులు నమోదవుతున్నాయి.

Update: 2021-05-08 04:56 GMT

కోవిడ్ రూల్స్ సడలించిన ఆస్ట్రేలియా

Australia: భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ తో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం కొంత వెనక్కు తగ్గింది. భారత్ నుంచి తమ దేశ పౌరుల రాకపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇవి ఈ నెల 15 వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.

తాజా సమాచారం ప్రకారం ఈ రోజు (శనివారం) నుంచి భారత్ నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ఇండియా నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలియా కు వెళ్లేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. మే 15 నుంచి 31 మధ్య 3 విమానాలు భారత్‌కు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. అవి మరలా ఆయా తేదీల్లోనే తిరిగి ఆస్ట్రేలియా బయలుదేరుతాయని పేర్కొన్నారు. అయితే ఇవి కమర్షియల్ విమానాలు కాదని పేర్కొంది.

Tags:    

Similar News