Pakistan: ఎన్నికలకు ఒకరోజుముందు.. పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్థాన్‌..

Pakistan Blasts: పాకిస్తాన్‌లో ఎన్నికల ముందు వరుస పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-02-07 11:30 GMT

Pakistan: ఎన్నికలకు ఒకరోజుముందు.. పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్థాన్‌..

Pakistan Blasts: పాకిస్తాన్‌లో ఎన్నికల ముందు వరుస పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి 25 మందికి పైగా ప్రాణాలను కోల్పోగా.. 40 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుళ్లు జరిగాయి. పిషిన్, కిల్లా సైపుల్లా జిల్లాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. రేపు అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నైరుతి ప్రావిన్స్‌ బలూచిస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వద్ద మొదటి పేలుడు జరిగింది. ఈ సంఘటనలో 12 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

కాగా, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖిల్లా సైఫుల్లా పట్టణంలో రెండవ దాడి జరిగింది. జమియాత్ ఉలేమా ఇస్లాం కార్యాలయం సమీపంలో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల వెనుక ఎవరున్నారన్నది ప్రభుత్వం ఇంకా దృవీకరించలేదు. అయితే ఉగ్రవాదులు, బబూచిస్థాన్‌ వేర్పాటు వాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ పోస్టులు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి పాక్ ఎన్నికల సంఘం పోలీసుల నుంచి నివేదిక కోరింది. ఈ పేలుళ్ల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News