ఏపీ-తెలంగాణ వాతావరణం: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు.. ఐఎండీ ఎల్లో అలర్ట్‌లు జారీ!

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జూలై 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో వర్ష సూచన వివరాలు చదవండి.

Update: 2025-07-16 06:39 GMT

AP-Telangana Weather Update: Heavy Rains Tomorrow and Day After, IMD Issues Yellow Alerts!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల దాడికి ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో జూలై 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రెండు రోజులపాటు భారీ వర్ష సూచన – తెలంగాణకు హెచ్చరిక

హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం:

జూలై 16: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అంచనా.

జూలై 17:

  • భారీ వర్షాలు కురిచే జిల్లాలు: భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి
  • ఎల్లో అలర్ట్‌లు జారీ
  • బలమైన గాలులు వీచే అవకాశమూ ఉంది

జూలై 18:

  • భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు: రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్
  • తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం
  • బలమైన ఉపరితల గాలులకు అవకాశం

హైదరాబాద్‌ వాతావరణం:

హైదరాబాద్‌లో ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశల్లో 06-08 కి.మీ వేగంతో వీస్తాయని అంచనా.

ఆంధ్రప్రదేశ్ వాతావరణం – జిల్లాలవారీగా వర్ష సూచన

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తాజా నివేదిక ప్రకారం:

  • జూలై 16: తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే జిల్లాలు:
  • మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి
  • మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
Tags:    

Similar News