ఇటలీలో 9,712 కరోనా కేసులు

చైనా తరువాత కరోనా వైరస్‌ అత్యంత ప్రభావం చూపుతున్న దేశాలు ఇటలీ, ఇరాన్‌. దీంతో ఇటలీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలంతా

Update: 2020-03-10 15:45 GMT

చైనా తరువాత కరోనా వైరస్‌ అత్యంత ప్రభావం చూపుతున్న దేశాలు ఇటలీ, ఇరాన్‌. దీంతో ఇటలీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నిబంధన విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని ఇటలీ ప్రభుత్వం దేశ ప్రజలను ఆంక్షలు విధించింది. రెండు రోజుల క్రితం వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే అమలు చేసిన ఈ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలుపరుస్తోంది. దీంతో దాదాపు ఆరు కోట్లకు పైగా జనాభా ఉన్న ఇటలీ ప్రజలు స్వచ్చందంగా నిర్భందంలో ఉండనున్నారు. కాగా ఇప్పటికే ఇటలీలో 9,712 కరోనా కేసులు నమోదు కాగా... మృతుల సంఖ్య 463కు చేరుకుంది.  

Tags:    

Similar News