Pakistan Pilots hold Fake Flying License: 262 మంది పైలట్లకు నకిలీ లైసెన్సులు..

Pilots Fake Flying License:పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పిఐఎ) కి చెందిన 150 మంది పైలట్లపై నిషేధం విధించారు.

Update: 2020-06-26 10:54 GMT

Pakistan Pilots hold Fake Flying License: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పిఐఎ) కి చెందిన 150 మంది పైలట్లపై నిషేధం విధించారు. ఈ విషయాన్నీ ప్రభుత్వ విమానయాన సంస్థ స్వయంగా ప్రకటించింది. వీరి లైసెన్సులు నకిలీవని తేల్చిన తరువాతే వీరిపై నిషేధం విధించినట్టు పేర్కొంది. మే 22 న కరాచీలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.. ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, పిఐఎలో మొత్తం 860 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో 262 మంది పైలట్ కావడానికి పరీక్ష రాయలేదని తేల్చినట్టు పార్లమెంటులో చెప్పారు. దాంతో వీరిపై చర్యలకు ఉపక్రమించినట్టు తెలిపారు.

వీరంతా రాజకీయ నాయకుల ఒత్తిడితో ఉద్యోగం సంపాదించారని ఖాన్ స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిడి , జోక్యం ఆధారంగా పిఐఎలో పైలట్ల నియామకాలు జరిగాయని.. నకిలీ పైలెట్లకు సంబంధించి 2019 ఫిబ్రవరిలోనే దర్యాప్తు జరిగిందని ఇందులో ప్రభుత్వ విమానయాన సంస్థలలో 40% పైలట్లకు నకిలీ లైసెన్సులు ఉన్నాయని చెప్పారు. నిషేధించిన పైలట్లకు అవసరమైన ఫ్లై అనుభవం కూడా లేదని.. విమానయాన రంగంలో రాజకీయాలు కూడా జోక్యం చేసుకోవడం దేశానికి దురదృష్టం అని పేర్కొన్నారు. మరోవైపు గత నెలలో కరాచీలో కూలిపోయిన విమానంలో సాంకేతిక లోపం లేదని. ఈ ప్రమాదానికి పైలట్, క్యాబిన్ సిబ్బంది, ఎటిసి కారణమని గులాం సర్వార్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగాఈ ప్రమాదంలో 8 క్యాబిన్ సిబ్బందితో సహా 97 మంది మరణించారు. 2 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

 

Tags:    

Similar News