సైన్స్‌ ఫిక్షన్ చిత్రం కాదు.. విమానంలోని ప్రయాణికుల పరిస్థితి ఇది .. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్ ట్వీట్

సైన్స్‌ ఫిక్షన్ చిత్రం కాదు.. విమానంలోని ప్రయాణికుల పరిస్థితి ఇది .. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్ ట్వీట్
x
Highlights

కరోనా వైరస్ ప్ర‌పంచం మొత్తం క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

కరోనా వైరస్ ప్ర‌పంచం మొత్తం క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మ‌రి వ‌ల్ల‌ సామాజిక దూరం, మాస్కులు, శానిటైజర్లు, జీవితంలో భాగమయ్యాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం 'వందే భారత్‌ మిషన్', 'సముద్ర సేతు' కింద ప్రత్యేక విమానాలు, ఓడలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి షేర్‌ చేసిన చిత్రం పరిస్థితులకు అద్దం పడుతుంది. ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరుల‌ను తీసుకొచ్చే కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది. విమానాల్లో వారు ఫేస్ షిల్డులు మంత్రి హర్దీప్‌ సింగ్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులందరు ఫేస్‌ షీల్డులు సైంటిఫిక్‌ చిత్రంలోని దృశ్యంలా క‌నిపించాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి మంత్రి హర్దీప్‌ సింగ్ 'కాలాలు మారుతోంది. ఇది సైన్స్‌ ఫిక్షన్ చిత్రంలోని దృశ్యం కాదు. సింగపూర్ నుంచి ముంబై వచ్చిన విమానంలోని ప్ర‌యాణికులు చిత్రాలు. నివారణ చర్యలు సరి కొత్తగా ఉన్నాయి. ' అని‌ ట్వీట్ చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories