పాక్ రహస్య డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్‌

Arun Chilukuri
Published on: 20 Jun 2020 10:49 AM IST
పాక్ రహస్య డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్‌
X

జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను భారత భదత్ర బలగాలు కూల్చి వేసాయి. పాకిస్థాన్ రహస్య డ్రోన్ తిరుగుతూ చిత్రాలు తీస్తుండగా బార్డర్ సెక్యూరిటీ పోలీసులు కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశారు. కథువా జిల్లా హీరానగర్ సెక్టారులోని రథువా వద్ద శనివారం ఉదయం పాకిస్థాన్ దేశానికి చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ కు చెందిన జవాన్లు దాన్ని చూసి 8 రౌండ్ల కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశారు. ఇవాళ ఉద‌యం 5.10 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. డ్రోన్ కూల్చివేత‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story