పైలట్‌కు కరోనా.. విమానం వెనక్కి

Arun Chilukuri
Published on: 30 May 2020 4:31 PM IST
పైలట్‌కు కరోనా.. విమానం వెనక్కి
X

కరోనా వైరస్ వ్యాపించడంతో మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని మార్గమధ్యలోనే వెనక్కి రప్పించారు.

విమానంలోని పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని విమానయాన సంస్థ గ్రౌండ్‌ సిబ్బంది గుర్తించారని ఎయిర్‌ఇండియా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆ విమానం శనివారం అర్ధరాత్రి దిల్లీకి చేరుకుంటుందని తెలిపారు. సిబ్బంది క్వారంటైన్‌లో ఉంటారని, మాస్కోకు మరో విమానాన్ని పంపిస్తామని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story