Baby Health : డాక్టర్లు వద్దు మొర్రో అన్నా వినరా? పసిపిల్లల పాలలో ఎంత రిస్క్ ఉందో తెలుసా ?

డాక్టర్లు వద్దు మొర్రో అన్నా వినరా? పసిపిల్లల పాలలో ఎంత రిస్క్ ఉందో తెలుసా ?

Update: 2026-01-26 01:06 GMT

 Baby Health : చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తుపై గట్టి ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా పసిబిడ్డలకు తల్లి పాలు కాకుండా ఇతర పాలు పట్టే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. "చిన్న పిల్లలకు ఆవు పాలు ఎప్పుడు ఇవ్వాలి? అది ఆరోగ్యానికి మంచిదేనా?" అనే ప్రశ్నలకు నిపుణులు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తున్నారు. పౌష్టికాహార నిపుణుల సూచనల ప్రకారం.. ఆవు పాలు అమృతం లాంటివే అయినప్పటికీ, అవి సరైన వయసులో ఇస్తేనే ఫలితం ఉంటుంది.

ఒక ఇంట్లో పసిబిడ్డ అడుగుపెట్టినప్పటి నుంచి ఆ చిన్నారి తిండి విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ ఎదుగుదలకు పాలు ప్రధాన వనరు అయినప్పటికీ, అది ఏ పాలు అనేది చాలా ముఖ్యం. సాధారణంగా ఆవు పాలలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే ఈ పోషకాలు ప్రతి వయసు వారికి సరిపడవు. ముఖ్యంగా ఒక సంవత్సరం నిండని పసిబిడ్డలకు ఆవు పాలు పట్టడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎందుకు ఏడాది లోపు వద్దు?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల జీర్ణవ్యవస్థ ఆవు పాలను అరిగించుకునే స్థాయికి ఎదగదు. ఆవు పాలలో ప్రోటీన్లు, ఖనిజాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వీటిని పసిబిడ్డల చిన్న కిడ్నీలు, పొట్ట భరించలేవు. దీనివల్ల వాంతులు, విరేచనాలు, గ్యాస్ లేదా తీవ్రమైన కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా ఆవు పాలు శిశువుల శరీరంలో ఐరన్, శోషణకు అడ్డుపడతాయి. దీనివల్ల పిల్లలు రక్తహీనత బారిన పడే ప్రమాదం ఉంది.

సరైన సమయం ఎప్పుడు?

చిన్నారికి ఏడాది నిండిన తర్వాతే ఆవు పాలను పరిచయం చేయడం ఉత్తమం. అప్పటికి బిడ్డ ఘన పదార్థాలను తినడం కూడా మొదలుపెడుతుంది కాబట్టి, ఆవు పాలను ఆహారంలో భాగంగా చేర్చవచ్చు. అయితే ప్రారంభంలో తక్కువ పరిమాణంలో పాలు ఇస్తూ, బిడ్డకు పాలు పడుతున్నాయా లేదా అన్నది గమనించాలి. కొంతమంది పిల్లలకు పాలు తాగిన తర్వాత అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం.

తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినవి

ఆవు పాలు ఇచ్చే ముందు వాటిని బాగా మరిగించి, ఆ తర్వాత చల్లార్చి పట్టాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల భయం ఉండదు. ఒకవేళ ఆవు పాలు తాగిన తర్వాత బిడ్డలో విపరీతమైన ఏడుపు, జీర్ణక్రియలో ఇబ్బందులు లేదా చర్మంపై దద్దుర్లు వంటివి కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి. శిశువుకు ఏడాది నిండే వరకు తల్లి పాలు లేదా ఫార్ములా పాలు మాత్రమే సురక్షితమైనవని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News