Health: రోజూ ఉదయం ఈ పండును తీసుకుంటే.. సమస్యలన్నీ పరార్‌

Update: 2025-01-22 04:24 GMT

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిసిందే. అయితే చాలా మంది వీటిని రెగ్యులర్‌గా తీసుకోరు. ఏదో జ్వరం వచ్చినప్పుడో, ఆరోగ్యం బాగాలేనప్పుడే తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పండ్లను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతీ రోజూ ఉదయం టిఫిన్‌లో భాగంగా పండును భాగం చేసుకోవాలని చెబుతున్నారు. ఉదయం టిఫిన్‌లో భాగంగా దానిమ్మను తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దానిమ్మకు సహజసిద్ధంగా చక్కెరను నియంత్రించే శక్తి ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, దీని కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. టిఫిన్‌ తర్వాత దానిమ్మపండు తినడం వల్ల రోజంతా షుగర్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ముఖ్యంగా పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

దానిమ్మలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనానికి, ప్రేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచడంలో సహాయపడుతాయి. వయసుతో పాటు వచ్చే లక్షణాలను తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. దానిమ్మపండులో తక్కువ క్యాలరీలు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన భావన త్వరగా కలుగుతుంది. దీంతో సహజంగానే తక్కువగా తింటాం ఇది బరువు తగ్గడానికి పరోక్షంగా దోహదపడుతుంది.

Tags:    

Similar News