Ministry of Defence Jobs: రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..!
Ministry of Defence Jobs: ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగులకి సువర్ణావకాశం.
Ministry of Defence Jobs: రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..!
Ministry of Defence Jobs: ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగులకి సువర్ణావకాశం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. దీని కింద, లైబ్రేరియన్, స్టెనో, ఎల్‌డిసితో సహా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ప్రకటన తేదీ నుంచి 21 రోజుల వరకు ఉంటుంది.
ఖాళీ వివరాలు
1. లైబ్రేరియన్ - 1 పోస్ట్
2. స్టెనో గ్రేడ్ II - 2 పోస్ట్‌లు
3.LDC - 6 పోస్ట్‌లు
4. ఫైర్‌మ్యాన్ - 3 పోస్ట్‌లు
5. మెసెంజర్ - 13 పోస్ట్‌లు
6. బార్బర్ - 1 పోస్ట్
7. వాషర్‌మాన్ - 1 పోస్ట్
8. రేంజ్ చౌకీదార్ - 1 పోస్ట్
9. డ్రాఫ్టీ - 2 పోస్ట్‌లు
అర్హతలు
1. లైబ్రేరియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BA, B.Sc, B.Com లేదా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి.
2. స్టెనో గ్రేడ్-II మరియు LDC పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
3. మిగిలిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయో పరిమితి
1. జనరల్ కేటగిరీ - 18-25 సంవత్సరాలు
2. OBC కేటగిరీ - 18-28 సంవత్సరాలు
3. SC & ST వర్గం - 18-30 సంవత్సరాలు
ఎలా దరఖాస్తు చేయాలి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను మరియు పత్రాలను దరఖాస్తు చివరి తేదీకి ముందు దిగువ పేర్కొన్న చిరునామాకు పోస్ట్ చేయాలి.
చిరునామా – సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ, PH & HP (I) సబ్ ఏరియా పిన్-901207 C/o 56 APO